గుంటూరు రోడ్లు మీద సిటీ బస్సులు ?

Written by

 

guntur city buses

గుంటూరు నగర ప్రజల చిరకాల కల కొద్దీ రోజుల్లో నిజంకాబోతుంది.గుంటూరు నగరం లో దీర్ఘ కాల సమస్యలు ఏమైనా ఉందంటే అది శానిటేషన్, ట్రాఫిక్ మరియు ఇన్ఫ్రా. నగరం లో ఇప్పటివరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం గ రోడ్లు విస్తరించనే లేదు.నిజానికి ఇప్పటి రోడ్లు ఎప్పుడో బ్రిటిష్ వారు అప్పటి అవసరాలకోసమని విస్తరించినవే. కాగా ఇప్పుడు రోజులు మారాయి నగర శివారు పది గ్రామాలని విలీనం చేయటం అందులోను రాజధాని ఇక్కడికే రావటం వలన నగర పరిధి పెరిగి సెర వేగంగ విస్తరిస్తుంది.
కావున రాబోయే దశకాలలో నగరం లో జనాభా ఘణనీయంగా పెరుగుతుంది అనటం లో సందేహమే లేదు.కానీ నగరం లో మాత్రం జనాభా కి అనుగుణంగ తగిన రోడ్ల వసతి లేదనే చెప్పొచ్చు.ఇరుకు రోడ్లు, విచ్చల విడిగా తిరిగే ఆటోలు, స్పోర్ట్స్ కార్లని తలదన్నేల డ్రైవింగ్ చేసే డొక్కు సిటీ బస్సులు వీటితో నగరజీవికి రోడ్ల మీద ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి.నగరం లో ట్రాఫిక్ కి కళ్లెం వేయాలన్న మరియు ఆటో డ్రైవర్ల విచ్చలవిడి తత్వానికి అడ్డుకట్ట వేయాలని ఇప్పుడు సిటీ బస్సుల ఆవశ్యకత ఎంతగానో వుంది.
నిజానికి గుంటూరు నగరం లో ఒకప్పుడు ఇప్పటి విశాఖ మరియు విజయవాడ నగరాల వలె సిటీ బస్సులు తిరుగుతుండేవి.నష్టాల కారణంగానో మారె ఇతర కారణాల వల్ల RTC బస్సులు తిప్పటం ఆపివేయటం జరిగింది.కానీ కొద్దిరోజులకే ఆపివేసిన సిటీ బస్సులును పునరుద్ధరించాలని ప్రపోసల్ రాగ దానిని గత పాలక వర్గం లో ఒక పేరొందిన మంత్రి వర్యులు ప్రైవేట్ సిటీ బస్సుల యాజమాన్యం ఇచ్చిన కానుకులకో లేక సామజికవర్గ ఫీలింగ్ వల్లనో నగరం లో అవి తిరగనివ్వకుండా వాయిదావేయిస్తూ ఉండేవారు దానికి కారణం ఏమనగా నగరం లో రోడ్ల దుస్థితి బాగోలేదని కొంటెసాకులు చెప్తుండేవారు అలాగని పోనీ రోడ్లు ఏమైనా విస్తరించడానికి కృషి చేసారా అంటే అది కూడా లేదు.మనకి శాంక్షన్ ఐనవి వచ్చినవి వచ్చినట్లుగ వేరే నాగరాలికి వెళిపోయేవి.
పుష్కరాల పుణ్యమా అని నగరం లో రోడ్లని విస్తరించటం స్టార్ట్ చేసింది ఇప్పుడు ఉన్న పాలక వర్గం.పుష్కరాలు ఈరోజుతో ముగిసిపోయిన మన రోడ్ల విస్తరణ మాత్రం మందకుడిగానే జరుగుతుంది. రోడ్లు విస్తరణ జరిగితే ట్రాఫిక్ కి కొంతమేర ఉపశమనం కలుగుతుంది.సిటీ బస్సులు తిప్పటానికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
నగర ప్రజలు ఈ డొక్కు బస్సుల్ని ఎంత మాత్రం సహించలేకున్నారు.సిటీ బస్సులు అన్ని రూట్లలో తిప్పితే, ప్రజలు అలవాటుపడి ఇప్పుడున్న బస్సులు ని ఎంకరేజ్ చేయరు,కాబట్టి ప్రైవేట్ ఆపరేటర్ల కి నష్టాలూ వచ్చి మల్లి వాటిని తిప్పే ధైర్యం చేయరని అంకుంటున్నాము.

రాజకీయనాయకులు మరియు ప్రజాప్రతినిధులు,గుంటూరు నగర ప్రజలకి ఈ డొక్కు సిటీ బస్సులు నుంచి విముక్తి కలిగిస్తారని ఆకాంక్షిస్తున్నాము.

-ప్రతాప్

 

 

Article Categories:
Guntur city

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share This